KRNL: పెరుగుతున్న పోటీ ప్రపంచంలో ఏవియేషన్‌లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని ఎయిర్ డైవ్ సంస్థ డైరెక్టర్ సుస్మిత పేర్కొన్నారు. గురువారం కర్నూలుల్లోని ఓ డిగ్రీ కళాశాల హాస్టల్లో విద్యార్థులకు విమానాలపై అవగాహన సదస్సును డిప్యూటీ వార్డెన్ డాక్టర్ పామీద బేగం ఆధ్వర్యంలో నిర్వహించారు. విమానయాన రంగంలో మహిళలకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.