TPT: పట్టణంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ చంద్రశేఖర రావు తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో తిరుపతి పడమర ప్రాంతాల పరిధిలోని జీఎస్ మాడా వీధి, కర్నాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు, చిన్న బజారు వీధి ప్రాంతాల్లో ఉదయం 8:30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.