CTR: వీకోట మార్కెట్ యార్డులో వివాదంపై మార్కెటింగ్ శాఖ AD పరమేశ్వర్ విచారణ జరిపారు. ఉగాది సెలవు రోజున కూరగాయలు కొనుగోలు చేసి, ఎగుమతులకు సిద్ధమైన ఓ వ్యాపారిని అసోసియేషన్ సభ్యుడు ఒకరు అసభ్య పదజాలంతో దూషించాడని కలెక్టర్ సుమిత్ కుమార్కు బాధితుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో AD మార్కెట్ యార్డుకు వెళ్లి విచారించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.