విశాఖపట్నం రుషికొండ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆస్థానం, పంచాంగ శ్రవణం జరుగుతాయని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.