NLR: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని నాయుడుపేట పట్టణంలోని ఆమె నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించి నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘం అధ్యక్షులు శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘంలో తమకు అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే విజయశ్రీకు వారు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.