PPM : పార్వతీపురం, కృష్ణపల్లి పంచాయతీలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కృష్ణపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు అక్రమ కట్టడాలకు సంబంధించిన వివరాలను ప్రజలు వివరించారు. వెంటనే నోటీసులు ఇప్పించి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.