సత్యసాయి: బుక్కపట్నంలో డీఎడ్ కోర్సులో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ సూచించారు. ఇంటర్ పూర్తి చేసిన వారు లేదా ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి 17 ఏళ్లు నిండిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.