కాకినాడ జిల్లా జగ్గంపేట బస్టాండ్లో ప్రయాణికులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందడం లేదు. నీటి పైపులైనులు నాచు పట్టి అపరిశుభ్రంగా ఉన్నాయి. షాపుల నుండి వేలాది రూపాయల అద్దె వసూలు చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం కనీస సదుపాయాలు కల్పించడం లేదు. ఎండాకాలం నేపథ్యంలో వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.