KRNL: ఎండాకాలం నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించాలని పంచాయతీ అభివృద్ధి అధికారి రాజశేఖర్ గౌడ్ సూచించారు. శుక్రవారం హోలగుందలో మాట్లాడుతూ.. నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.