KRNL: గోమాత గొప్పతనాన్ని చాగంటి కోటేశ్వరావు ప్రవచనాల ద్వారా తెలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. శుక్రవారం కర్నూలు సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల మైదానంలో గోమాత వైభవంపై చాగంటి కోటేశ్వరావు ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. చాగంటి యుగ పురుషుడని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కొనియాడారు.