NTR: చందర్లపాడు హైస్కూల్లో ఇవాళ జిల్లా అంధ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీనిని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. శిబిరంలో స్థానిక ప్రజలు, వృద్ధులు, మహిళలు పాల్గొని కంటి సంబంధిత సమస్యలకు ఉచిత పరీక్షలు, అవసరమైన మందులు పొందారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులకు పెద్ద మేలు చేస్తాయన్నారు.