KDP: 16వ తేదీన నిర్వహించాల్సిన రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమం వాయిదా పడినట్లు చక్రాయపేట తహసిల్దార్ విజయకుమారి శనివారం తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రైతులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆమె తెలిపారు.