VSP: పెదవాల్తేర్ పోలమాంబ గుడి సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు త్రిటౌన్ సీఐ తెలిపారు. వినయ్, దినేష్, నిఖిలేశ్వర్ రావ్, అప్పారావు మాట్లాడుకుంటుండగా.. వినయ్ బీర్ బాటిల్‌తో అప్పారావుపై దాడి చేశాడు. వెంటనే క్షతగాత్రుడిని కేజీహెచ్‌కు తరలించి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘర్షణకు సంబంధించి కారణాలు ఆరా తీస్తున్నారు.