VZM: గరివిడి మెయిన్ రోడ్లో ఉన్న కాలవలో పూడిక గత మూడు నెలలుగా తీయడంలేదని స్థానికులు వాపోతున్నారు. కూరుకుపోయిన బురద వలన రోడ్డు మార్గాన్న పోయే ప్రయాణికులకు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. కాలవలో ఉన్న కుళ్ళిన బురద వలన దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి సమస్యని పరిష్కారించాలని కోరుతున్నారు.