W.G: పాలకొల్లులోని ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మద్దాల శ్రీనివాస్ డ్రగ్స్‌పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గంజాయి, నాటు సారా, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలని ప్రభుత్వం, శాఖ పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. ఇందుకు యువత సహకారం కావాలన్నారు. మత్తు పదార్థాల విక్రయాలు జరిగితే సమాచారం ఇవ్వాలని కోరారు.