VZM: భారత రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బాలాజీ జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్పర్సన్ పాలవలస యశస్వి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు.