VSP: అడవివరం ఎంజేపీ స్కూల్, కాలేజ్ హాస్టళ్లను రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి. కాంతారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, ఎలుకల ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రికార్డుల నిర్వహణ, మెస్ మెనూపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.