కడప జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు వివిధ స్టేషన్ల పరిధిలో కార్యక్రమాలు చేపట్టారు. మైనర్ల డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం, ఓవర్‌స్పీడ్, డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణాలు చేయాలని సూచించారు.