PLD: YCP పార్టీ నాయకుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుని నరసరావుపేటలోని తన నివాసంలో మంగళవారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి అనుమతులు లేని కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గృహ నిర్బంధంపై బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.