కృష్ణా: గన్నవరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు తెలిపారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో రూ.25 కోట్లతో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి ప్రతిపాదనలను పరిశీలించారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్యం సహించబోమని ఆయన హెచ్చరించారు.