SKLM: పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో బుధవారం ఎమ్మెల్యే గౌతు శిరీష దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని నేటి నుంచి అమలు చేసిందని తెలిపారు. ఇప్పటికే మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్టీసి ఉచిత ప్రయాణం చేస్తున్నారని గుర్తు చేశారు.