శ్రీకాకుళం: ఎల్ఎన్ పేట మండలం మోదుగు వలస గ్రామంలో శ్రీ రామలింగేశ్వర ఆలయ 32వ వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి రూ. 20వేల ఆర్థిక సహాయం అందించారు.