GNTR: ఈనెల 17న ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తిరంగా యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు అన్నారు. గురువారం చంద్రమౌళినగర్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కి ప్రధాని మోదీ సరైన గుణపాఠం చెప్పారని, ఆపరేషన్ సింధూర్‌లో ఆర్మీ చేసిన సాహసం మరువలేనిదని కొనియాడారు.