NTR: నందిగామలో కళారత్న పురస్కార గ్రహీత బొబ్బిళ్ళపాటి సాయిని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శుక్రవారం ఘనంగా సత్కరించారు. పరాభవ నామ సంవత్సర కళారత్న పురస్కారం–2026 అందుకున్న సందర్భంగా శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కళారంగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి గౌరవం పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. సాయి నందిగామకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు.