SKLM: జిల్లాలో విశ్రాంత అధికారి కృష్ణమోహన్‌ను సైబర్ నేరగాళ్లు “డిజిటల్ అరెస్టు” పేరిట బెదిరించి రూ.56 లక్షలు దోచుకున్నారు. మానవ అక్రమ రవాణా కేసులో విచారణకు ముంబయి రావాలని చెప్పి, ముందుగా డిపాజిట్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. బెదిరింపులతో విడతలుగా మొత్తం నగదు తీసుకున్నారు. నంబర్లు పనిచేయకపోవడంతో బాధితుడు 1930కు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.