KRNL: మంత్రాలయం గ్రామదేవత శ్రీ మంచాలమ్మ దేవికి ఉగాది పండుగను పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించి పట్టుచీరలు మామిడికాయలతో అలంకరించారు. శ్రీ మఠంలో ఉగాది పండుగను పురస్కరించుకుని పీఠాధిపతి సంస్థాన పూజలలో భాగంగా శ్రీమన్ మూల రామచంద్రుడికి కనకాభిషేకం చేసి మంగళ హారతులు ఇచ్చారు.