VSP: ప్రముఖ సాహితీవేత్త ఎల్.ఆర్ స్వామి ఇవాళ ఉదయం విశాఖలో కన్నుమూశారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటుగా నిలిచింది. రేపు ఉదయం 10 గంటలకు విశాఖ విశాలాక్షి నగర్లోని కుమార్తె నివాసం నుంచి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్సిస్టు అధ్యయన కేంద్రం కన్వీనర్ జె.వి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, తదితరులు నివాళులు అర్పించారు.