కోనసీమ: ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గోదావరి లంకలో నిల్వఉంచిన 1800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశామని ఎక్సైజ్ సీఐ కాత్యాయని తెలిపారు. పది లీటర్ల సారా, ఐదు లీటర్లు అమ్మోనియా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కొత్తపేట ఎక్సైజ్ పరిధి ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసామన్నారు.