NRML: ముస్లిం సోదరులు రంజాన్ పండుగను సంతోషంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద నిర్వహించే ప్రార్థనా స్థలాన్ని సీఐ ప్రవీణ్ కుమార్, నూతన అడహాక్ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. పోలీస్ శాఖ తరపున ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు.