ADB: ఆదివాసి గిరిజనుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎస్కే అబ్దుల్లా కోరారు. ఆదివారం మధ్యాహ్నం దండపల్లి మండలంలోని రాజుగూడ గ్రామంలో నిర్వహించిన ఆదివాసి గిరిజన సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఆదివాసులకు సరైన ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.