KMR: సదాశివనగర్ మండలం కుప్రియాల్ శివారులో 44వ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లాకు చెందిన రాజశేఖర్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు రోడ్డు కిందికి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా వారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.