ADB: బోథ్ మండల పరిధిలోని అందూర్ గ్రామపంచాయతీలో నారాయణపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు.