KMR: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి పలువురు నాయకులు ఉన్నారు.