నెల్లూరు: ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఒంగోలులోని వారి నివాసంలో ఆదివారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాసుల రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.