నెల్లూరు: ఉదయగిరి మండలం కుర్రపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దేశ్వరం నుంచి స్వగ్రామమైన బెడుసుపల్లికి వస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఉదయగిరి సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో జేరిపోతుల తిరుపతయ్య, రమాదేవికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకి తరలించారు.