KKD: పిఠాపురం ఇందిరానగర్ యూపీహెచ్‌సీలో సీపీఆర్‌పై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య అధికారి బత్తుల జయరాం వైద్య సిబ్బందికి, రోగులకు, ప్రజలకు సీపీఆర్ ఆవశ్యకతను వివరించి, ఎలా చేయాలో నేర్పించారు. గుండె, శ్వాస ఆగిపోయిన అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేపట్టడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ ప్రాథమిక సీపీఆర్ పద్ధతి నేర్చుకోవాలన్నారు.