CTR: ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో రాధా రాణి సూచించారు. సదుం మండలం పాలమందలో పలు కార్యక్రమాలలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ప్రజలతోపాటు స్వయం సహాయ సంఘ సభ్యులకు పాడి ఆవుల మంజూరు, పశువుల తొట్టెల నిర్మాణ పనులు మంజూరు చేస్తామన్నారు. పాఠశాల వద్దనున్న వాటర్ ప్లాంట్ మరమ్మత్తులు చేసి బాగు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.