VZM: దాడితల్లి, సరే పోలమ్మ తల్లి అమ్మవారి పండుగలు నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పారిశుద్య పనులు చేపట్టాలని బొబ్బిలి మునిసిపల్ కమీషనర్ ఎల్.రామలక్ష్మి సూచించారు. సోమవారం ఆమె కార్యాలయంలో శానిటరీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… ప్రతి వార్డులో విజిబుల్ క్లినింగ్నెస్ ఉండేలా కాలువలు శుభ్రం చేయాలన్నారు.