VZM: ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచే నెల్లిమర్లలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ అంబేద్కర్ శనివారం తనిఖీ చేశారు. గోదాము షట్టర్లకుకు వేసిన సీలును, భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. EVM భద్రత విషయంలో అప్రమత్తంగా వుండాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.