PLD: గురజాల నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శనివారం రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. స్థానిక చల్లగుండ్ల గార్డెన్స్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరుగుతుందని ఆర్డీవో మతెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించనున్న ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలన్నారు.