ASR: వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవో లోకేశ్వరరావు అన్నారు. గురువారం పెదబయలు మండలంలోని మంగబంద (PVTG)గ్రామంలో ఆర్డీవో పర్యటించారు. అక్కడ వైద్యాధికారులు నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపును పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్యసేవల నాణ్యతను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. క్యాంపులో మందులు అందుబాటులో ఉంచాలన్నారు.