ప్రకాశం: బళ్లమిట్టకు చెందిన టి.విజయ ఆటోలో ప్రయాణించి గాంధీ రోడ్ వద్ద దిగేటప్పుడు రూ.50,000 నగదు, తాళాలు ఉన్న పర్సును మర్చిపోయాడు. విషయం తెలియజేయగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి సీసీటీవీ ఆధారంగా ఆటోను గుర్తించారు. ఆటో యజమానిని సంప్రదించగా పర్సు ఆటోలోనే ఉన్నట్లు తెలిసింది. అనంతరం ట్రాఫిక్ సీఐ జగదీష్ సమక్షంలో పర్సును బాధితురాలికి అప్పగించారు.