CTR: ఈ నెల 23న సదుంలోని ZP ఉన్నత పాఠశాలలో ప్రత్యేక శిబిరాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి శుక్రవారం విజ్ఞప్తి చేశారు. వికలాంగులు, వృద్ధులకు అవసరమయ్యే సహాయ పరికరాల గుర్తింపునకు నియోజకవర్గ స్థాయి శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందు కోసం ఉదయం 8 గంటలకు ఉచిత బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.