GNTR: మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు అందింది. గుంటూరు కొరిటిపాడుకు చెందిన ఎలిజాల శిరీష (25) మానసిక స్థితి బాగోలేక 7వ తేదీన ఇంట్లో చెక్క దూలానికి చున్నీతో ఉరి వేసుకొని చనిపోయిందని తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.