E.G: సర్పంచుల పదవీకాలం ముగియడంతో పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా డిప్యూటీ ఎంపీడీవో సిహెచ్ వి.వెంకటరమణ పదవి బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఆయనను నిడదవోలు నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షులు అబ్బిశెట్టి సత్తిరాజు, కూటమి నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని ఆయన అన్నారు.