SDPT: చెత్త విభజన పట్టణ ప్రజల అందరి బాధ్యతని మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి కొమురయ్య అన్నారు. బుధవారం ఆరపల్లె 7వ వార్డులో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ వాహనానికి తడి చెత్త పొడి చెత్తగా విభజించి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్ కాశ బోయిన సరిత పాల్గొన్నారు.