ప్రకాశం: మర్రిపూడి మండలంలో రైతులు పొగాకు ధరలు చూసి ఆందోళన చెందుతున్నారు. పొదిలి పొగాకు వేలం కేంద్రంలో వేలం ప్రారంభమై తొమ్మిది రోజులు దాటినా ధర మాత్రం పెరగలేదు. గత ఏడాది ప్రారంభంలో కేజీ రూ.280కు కొనుగోలు చేసిన పొగాకు ఈ ఏడాది కేజీ రూ.250 పలుకుతోంది. ఏడాది ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కేజీ రూ.300 ఉంటే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.