అన్నమయ్య: బి.కొత్తకోటకు సమీపంలోని పెద్ద చెరువు కట్టను కబ్జాల చెర నుంచి కాపాడాలని CPI నాయకులు డిమాండ్ చేశారు. చెరువు కింద ఉన్న భూ స్వాములు కొందరు వేస్ట్ మట్టిని భూముల్లోకి తోలి కట్టకు సమానంగా చదును చేసి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఆ స్థలాల్లో షెడ్లు ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చారన్నారు. కట్ట తూము, కాలువలను కూడా మూసి వేశారన్నారు.