విజయనగరం వై జంక్షన్ నుండి చిన్నాపురం జంక్షన్ వరకు రోడ్డు పునరుద్దరణ పనులకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శంకుస్థాపన చేశారు. 3 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి కొరకు రూ. 1.50 కోట్లతో నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ పాలవలస యశస్వి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.