GNTR: రాజధాని ప్రాంతం తుళ్లూరులోని స్కిల్ హబ్ భవనంలో గురువారం సీఆర్డీఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా ద్వారా సుమారు 500కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఆపై చదువుకున్న వారు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.